Osmania General Hospital History

 Osmania General Hospital History 

Affiliated university Kaloji Narayana Rao University of Health Sciences

Services

Beds 1168

Opened 20 April 1910; 113 years ago

Osmania General Hospital (OGH) is one of the oldest hospitals in India located at Afzal Gunj, Hyderabad and is named after its founder – Mir Osman Ali Khan, the last Nizam of Hyderabad. It is run by the Government of Telangana, and is one of the largest in the state. It was built at a construction cost of ₹2,00,00,000.

The hospital building, a heritage structure is in dire need of repairs and renovation.

History

The Afzal Gunj Hospital, the predecessor of the Osmania General Hospital, was established in 1866 by Salar Jung I.

The present hospital building was completed in 1919 on orders of the last Nizam of Hyderabad, Mir Osman Ali Khan. It was designed by British architect Vincent Jerome Esch and Nawab Khan Bahadur Mirza Akbar Baig in Indo-Sarcenic style. In 1926, the wards of the Afzal Gunj hospital were transferred to the new building.

The history of the hospital includes Dr. Yusuf Mirza, the 1st RMO (Resident Medical Officer).

Dr. K Gopal Rao was one of the team of doctors when started along with the RMO. Names of these doctors are still there at the General Ward entrance.

In 2015, the Chief Minister of Telangana, K. Chandrashekhar Rao announced a plan to demolish the building. This sparked outrage among heritage activists, and he immediately retracted the statement.

Himayat Ali Mirza, the great-grandson of Mir Osman Ali Khan, joined hands with the INTACH (Indian National Trust for Arts and Cultural Heritage). He believes minor renovations could improve the hospital building to restore the Osmania General Hospital.

ఉస్మానియా జనరల్ హాస్పిటల్

వికీపీడియా నుండి

ఉస్మానియా జనరల్ హాస్పిటల్


పటంWikimedia | © OpenStreetMap

భౌగోళికం

స్థానం అఫ్జల్ గంజ్, హైదరాబాదు, తెలంగాణ, భారత దేశం

నిర్దేశాంకాలు 17.372°N 78.474°E

వ్యవస్థ

[యూనివర్సిటీ అనుబంధం కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం

Services

అత్యవసర విభాగం కలవు

పడకలు 1168

హెలిపాడ్ No

చరిత్ర

ప్రారంభమైనది 20 ఏప్రిల్ 1910

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital) భారత దేశంలో పేరు గాంచిన ఆసుపత్రి.[1][2][3] ఈ ఆసుపత్రి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అఫ్జల్ గంజ్ ప్రాంతంలో ఉంది. భారత దేశంలో కల పురాతనమైన ఆసుపత్రిలలో ఇది ఒకటి. ఆఖరు నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించబడి తర్వాత అతని పేరు మీద ప్రసిద్ధికెక్కింది.[4] ప్రసుతము ఈ ఆసుపత్రి తెలంగాణా ప్రభుత్వము ద్వారా నడుపబడుతున్నది. 2022, మే 12న రోగుల స‌హాయ‌కుల‌కు మూడు పూట‌లా రూ. 5 కే భోజ‌న కార్యక్రమం ప్రారంభించబడింది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.



విషయాలు

1 చరిత్ర

2 పడకలు

3 సిబ్బంది

4 సదుపాయాలు

5 నిధులు

6 నూతన భవన నిర్మాణం

7 మూలాలు

చరిత్ర

ఉస్మానియా ఆసుపత్రిని పేదలకు ఉచితంగా వైద్య సహాయం అందించడానికై స్థాపించడం జరిగింది.



ఉస్మానియా ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా అక్బర్ హైడారి, డాక్టర్ నాయుడు, యువరాణి దుర్రేశ్వర్ మరియు కిషెన్ ప్రసాద్ ఉన్నారు.


హైదరాబాదు ఉస్మానియా ఆస్పత్రి ఆవరణములో వున్న ఒక చింత చెట్టు. దానికున్న ఒక బోర్డులో వున్న విషయం: 'ఈచెట్టు 1908 వ సంవత్సరంలో వచ్చిన వరదలలో సుమారు 150 మంది ప్రాణాలను కాపాడింది '

పడకలు

ఈ ఆసుపత్రిలో ఉన్న 1168 పడకలలో 363 పడకలు సూపర్ స్పెషాలిటీ, 160 ఎమర్జన్సీ, 685 సాధారణ పడకలు.


సిబ్బంది

ఈ ఆసుపత్రిలో 250 మంది వైద్యులు, అందులో 60 మంది ప్రొఫెసర్లు, 190 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు. 530 కంటే ఎక్కువ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. 800లకు పైగా నాన్-గజిటెట్ ఉద్యోగులు, క్లాస్-IV ఉద్యోగులు ఉన్నారు. 300 మంది హౌస్ సర్జన్లు, 240 నర్సింగ్ విద్యార్థులు ఉన్నారు.[5]


సదుపాయాలు

ఉస్మానియా ఆస్పత్రిలో 7 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన సీటీ స్కాన్‌, క్యాథ్‌ ల్యాబ్‌, అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్ ప్లాంట్ లను 2021, డిసెంబరు 14న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి. హరీశ్‌రావు ప్రారంభించాడు. ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీలు పాల్గొన్నారు.[6][7]

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 18 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రోగుల స‌హాయ‌కుల‌కు మూడు పూట‌లా రూ. 5 కే భోజ‌నాన్ని భోజనం అందించే కార్య‌క్ర‌మం ప్రారంభోత్సవంలో భాగంగా 2022 మే 12న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హ‌రీశ్‌రావు ఉస్మానియా ఆస్ప‌త్రిలో రూ. 5 కే భోజ‌న కార్యక్రమాన్ని ప్రారంభించాడు. రోగుల స‌హాయ‌కుల‌తో క‌లిసి హ‌రీశ్‌రావు, హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు ప‌లువురు అధికారులు భోజ‌నం చేశారు. ఉస్మానియా ఆస్ప‌త్రిలో కొత్త‌గా మంజూరైన 75 ఐసీయూ ప‌డ‌క‌ల్లో 40 ఐసీయూ ప‌డ‌క‌ల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి ప్రారంభించాడు.[8][9]

నిధులు

2014-15 బడ్జెటులో ఈ ఆసుపత్రికి 100 కోట్ల రూపాయలు కేటాయించబడింది.

ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు, నేషనల్‌ ఆక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ నామ్స్‌ ప్రకారం ఆస్పత్రిలోని పలు విభాగాలతో పాటు ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం 10 కోట్ల 14 లక్షల 67 వేల 437 రూపాలయను మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి 6 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకానికి, 4 కోట్ల 14 లక్షల 67 వేల 437 రూపాయలు దవాఖానను కార్పోరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దేందుకు వినియోగించనున్నారు.[10]

నూతన భవన నిర్మాణం

ప్రతిపాదన - హైకోర్టు స్టే


ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరువవతున్నందు వల్ల 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హాస్పిటల్ ను సందర్శించి, కొత్త భవన నిర్మాణానికి ఆదేశాలు జారీచేశాడు.[11] ఆ తరువాత కొందరు హైకోర్టును ఆశ్రయించి ప్రస్తుత నిర్మాణం కూల్చవద్దని కోర్టులో పిటీషన్ వేసిన నేపథ్యంలో కోర్టు స్టే ఇచ్చింది.


నిపుణుల కమిటీ పరిశీలన


తదనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు వేసిన ఐఐటి హైదరాబాద్ నిపుణుల కమిటీ హాస్పిటల్ అవసరాలకు ఈ భవనం పని చేయదని తేల్చింది.[12]


ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ అభిప్రాయం


హైకోర్టు ఆదేశాల ప్రకారం 2023 జూలై 3న సచివాలయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హ‌రీశ్‌రావు ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్ నూత‌న నిర్మాణ అంశంపై హాస్పిటల్ పరిధిలోని ప్రజా ప్రతినిధులతో నిర్వహించబడిన స‌మావేశంలో ప్రజల వైద్య అవసరాలకోసం పాత భవనాలు తొలగించి కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ స‌మావేశంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[13]

Comments

Popular posts from this blog

Memoirs of my Working-Life - Sir Mokshagunagdam Visvesvaraya

Ambedkar’s connection with Hyderabad

Rabindranath Tagore - Nizam Mir Usman Ali Khan and Hyderabad